ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఇద్దరు కొత్త శిష్యులు దొరికారు. వారిలో ఒకరు ప్రముఖ నటుడు మాస్ మహారాజ్ రవితేజ కుమారుడు మహాధన్ భూపతిరాజు కాగా మరొకరు దర్శకుడుగా మారిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు రిషి మంచు మనోజ్.
వీరిద్దరూ సందీప్ వంగా వద్ద దర్శకత్వంలో మెలకువలు నేర్చుకునేందుకు శిష్యులుగా చేరారు. ప్రస్తుతం సందీప్ వంగా ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చేస్తునందున వారిరువురూ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. కానీ వారింకా ఏబీసీడీలు నేర్చుకునే దశలోనే ఉన్నారు కనుక వారి పేర్లు తెరపై కనిపించవు.
స్పిరిట్‌లో ప్రభాస్‌కు జోడీగా త్రిప్తి దిమ్రీ నటించబోతున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబిరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం, ఎడిటర్: సందీప్ రెడ్డి వంగ; సంగీతం: హర్ష వర్ధన్ రామేశ్వర్; కెమెరా: రాజ్ తోట; యాక్షన్: సుప్రీమ్ సుందర్; ఆర్ట్: ఘార్గి ముఖర్జీ చేస్తున్నారు.
గుల్షన్ కుమార్ & టీ సిరీస్ సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, ప్రభాకర్ రెడ్డి వంగ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.