యువ హీరో రోషన్ కనకాల, సాక్షి మధోల్కర్ జంటగా చేస్తున్న ‘మోగ్లీ 2025’ నుంచి సయ్యారే అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ నేడు విడుదల చేశారు. చంద్రబోస్ వ్రాసిన ఈ పాటని కాలభైరవ స్వరపరిచి సంగీతం అందించడమే కాకుండా ఐశ్వర్య దరూరితో కలిసి చాలా శ్రావ్యంగా పాడారు.
ఇదొక రొమాంటిక్ యాక్షన్ సినిమా కానీ మోగ్లీ 2025 అనే టైటిల్ ఎందుకంటే ఈ ప్రేమకధ అడవి నేపధ్యంలో సాగుతుంది కనుక. ఈ సినిమాలో బండి సంజయ్ సరోజ్ కుమార్, హర్ష చెముడు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ కధ, దర్శకత్వం చేశారు. ఈ సినిమాకు సంగీతం: కాల భైరవ, కెమెరా: ఎం రామమూర్తి, ఎడిటింగ్: పవన్ కళ్యాణ్, ఆర్ట్: కిరణ్ మామిడి, యాక్షన్: నారాజ్ మడిగొండ చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 42గా నిర్మిస్తున్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిభొట్ల నిర్మాతలు. ఈ ఏడాది డిసెంబర్ 12న మోగ్లీ 2025 విడుదల కాబోతోంది.