మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ‘రాజాసాబ్’ దీపావళి పోస్టర్, ఆ సినిమాలో ఓ పాటలోనిదని చూస్తేనే అర్ధమవుతోంది. కనుక నేడో రేపో ఆ పాట కూడా విడుదలఉటుందని ప్రభాస్ అభిమానులు కళ్ళు కాయలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 5వ తేదీన రాజాసాబ్ మొదటి పాట రిలీజ్ చేయబోతున్నట్లు తాజా సమాచారం.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.
రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న రాజాసాబ్ 2026 జనవరి 9న సంక్రాంతి పండగకు ముందు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.