స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలో పెళ్ళి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. అతనితో కాబోయే భార్య హరిణ్య పసుపు కొమ్ములు దంచి పెళ్ళి పనులు ప్రారంభం అయ్యాయంటూ తమ ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానిలో ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ కాబోయే భార్య జడలాగి కాస్త అల్లరి చేసి బుగ్గ మీద చిన్న ముద్దు కూడా ఇచ్చాడు. వారిద్దరికీ సినీ పరిశ్రమలోవారు, బంధు మిత్రులు అభినందనలు తెలుపుతున్నారు. పెళ్ళి పనులు మొదలయ్యాయని పెళ్ళి కూతురే చెప్పేసి ఫోటోలు కూడా పెట్టేసింది కనుక త్వరలోనే ఆ సుమూహుర్తం ప్రకటించబోతున్నారు.
టాలీవుడ్‌లో మరో నటుడు నారా రోహిత్ కూడా ఈ నెల 30న శిరీష లేళ్ళని వివాహం చేసుకోబోతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సిఎం రేవంత్ రెడ్డిని కలిసి వివాహ పత్రిక ఇచ్చి తమ పెళ్ళికి రావాలసిందిగా ఆహ్వానించారు. నారా రోహిత్ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు.