కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్ మరికొన్ని రాష్ట్రాలలో బీజేపి కూటమి ఓట్ల దొంగతనాలు చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాలలో నివాసం ఉంటున్న ఓటర్ల పేర్లను బీహార్ ఓటర్ల జాబితాలో చేర్చి, తమ పార్టీని వ్యతిరేకించేవారి పేర్లను ఓటర్ జాబితాలో నుంచి తొలగింపజేస్తోందని రాహుల్ ఆరోపిస్తున్నారు. ఓటర్ జాబితా ప్రక్షాళన (సర్) పేరుతో కేంద్ర ఎన్నికల కమీషన్ చేతే కేంద్రం ఈ పాడు పని చేయిస్తోందని రాహుల్ ఆరోపిస్తున్నారు.
బీజేపిని వ్యతిరేకించే ఓటర్లను జాబితాలలో నుంచి తప్పించేసి, ఎక్కడో రాజస్థాన్, కర్ణాటకలో ఉన్న ఓటర్లను చేర్చుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ అయన ఆరోపణలను బీజేపి, కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా కొట్టి పడేశాయి.
ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమీషన్ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఓటర్ల జాబితాలు ప్రక్షాళన చేయబోతోంది. అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల సంఘాల సీఈవోలు దీని కోసం ఏర్పాట్లు, శిక్షణ కార్యక్రమాలు మొదలుపెట్టాలని సీఈసీ జ్ఞానేశ్వర్ ఆదేశించారు.
ముందుగా వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబోయే కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ్బ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో శిక్షణా కార్యక్రమాలు మొదలు పెట్టాలని ఆదేశించారు. కనుక ఇక నుంచి రాహుల్ గాంధీకి చేతి నిండా పనే!