రాజు బాజే వాలే షూటింగ్ సమాప్తం

March 10, 2026


img

ఇటీవల తెలుగు సినీ పరిశ్రమకు పెళ్ళిళ్ళ బ్యాండ్ వాద్యకారులపై ప్రేమ పుట్టుకొచ్చింది. మ్యారేజ్ బ్యాండ్, బ్యాండ్ మేళం, రాజు వెడ్స్ రాంబాబు వంటి సినిమాలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్‌కి కూడా ఈ బ్యాండ్ మేళం స్టోరీలపై ఆసక్తి మొదలైనట్లుంది.

పలాష్ ముచ్చల్ దర్శకత్వంలో బ్రిజేంద్ర కళ, అవికా గోర్ ప్రధాన పాత్రలు చేసిన ‘రాజు బాజా వాలే’ సినిమా త్వరలో నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. సూపర్ హిట్ హిందీ వెబ్‌ సిరీస్‌ ‘పంచాయత్’లో పంచాయితీ అసిస్టెంట్‌గా నటించి మెప్పించిన చందన్ రాయ్ ఈ సినిమాలో బ్యాండ్ మేళం వాధ్యకారుడుగా నటించారు. అతని ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు.

అయితే ఇది బ్యాండ్ మేళం నేపధ్యంతో సాగే ప్రేమ కథ కాదంటూ చిత్ర బృందం చిన్న హింట్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా బ్యాండ్ మేళం కళాకారులకు ఇస్తున్న సంగీత కానుక అని తెలిపారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అమన్ గుప్తా నిర్మించిన ఈ సినిమా త్వరలోనే నేరుగా ఓటీటీలోకి విడుదల కాబోతున్నట్లు సమాచారం. 


Related Post

సినిమా స‌మీక్ష