అమెరికా-ఇరాన్‌ యుద్ధం: భారత్‌లో సైడ్ ఎఫెక్ట్స్ షురూ!

March 10, 2026
img

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్‌ యుద్ధం 4-5  వారాలలో పూర్తవుతుందని ట్రంప్‌ చెపుతున్నారు. కానీ అంత త్వరగా ముగిసే అవకాశం కనిపించడం లేదు. పది రోజుల యుద్ధ సాగితేనే భారత్‌లో గ్యాస్ ధరలు పెరిగిపోయాయి.

మరో పది రోజులు సాగితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి. గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదని కనుక పుకార్లు నమ్మవద్దని చమురు కంపెనీలు చెపుతున్నాయి. కానీ వాణిజ్య గ్యాస్ సిలిండర్లు ఖరీదు పెరిగి లభ్యత తగ్గడంతో అప్పుడే దేశంలో కొన్ని ప్రధాన నగరాలలో హోటల్స్, బేకరీలు, స్వీట్ షాప్స్ వంటివి మూతపడుతున్న వార్తలు వస్తున్నాయి. 

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి వాటి లభ్యత కూడా తగ్గితే ముందుగా రవాణా రంగంపై ఆ భారం పడుతుంది. బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్, క్యాబ్, టాక్సీలు చార్జీలు పెరుగుతాయి. అలాగే నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు కూడా పెరుగుతాయి.    

పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంది కనుక బంకుల వద్ద అప్పుడే కొన్ని బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. లేదా పవర్, ప్రీమియం పెట్రోల్ మాత్రమే అమ్ముతున్నారు.

కనుక అమెరికా-ఇరాన్‌ యుద్ధం కొనసాగుతున్న కొద్దీ భారత్‌తో సహా ప్రపంచదేశాలకు మళ్ళీ కరోనాలా అగ్నిపరీక్ష మొదలవుతుంది. కనుక ట్రంప్‌కు యుద్ధం విరమించాలనే ఆలోచన కల్పించాలని అందరూ ఆ దేవుడిని ప్రార్ధించాల్సిందే. వేరే దారి లేదు.

Related Post