హర్షిత రెడ్డి, స్మేహ మనిమేగలై జంటగా చేస్తున్న ‘దీవానా’ టీజర్ రిలీజ్ ప్రకటనగా దాని ప్రమో వదిలారు. టీజర్ రేపు ఉదయం 10 గంటలకు విడుదల కాబోతోంది.
27 సెకన్ల చిన్న టీజర్ ప్రమోలోనే “ఈ గుండె చాలా గలీజుది రా భాయ్.. మనల్ని దేకనోళ్ళకోసమే కొట్టుకుంటాది... కానీ ఆ ఫీలింగ్ మస్త్ అనిపిస్తాది లే... పెయిన్ కిల్లర్రా ఆ నవ్వంటే..” అంటూ వాయిస్ ఓవర్లో చెపుతుంటే... ప్రేమ మైకంలో ఉన్న హీరో వేరే లోకంలో ఉన్నట్లు ట్రాఫిక్‌లో బైక్ రైడ్... ఇదొక మనసులను పులకింపజేసే చక్కటి ప్రేమ కథ అని చెప్పేశారు. అందుకే గీతా ఆర్ట్స్ వంటి ప్రముఖ సంస్థ ఈ సినిమా నిర్మిస్తోంది.
ఈ సినిమాకు కధ దర్శకత్వం: శ్రీకాంత్ సంగిశెట్టి, సంగీతం:ఈశ్వర్ చంద్, కెమెరా: వంశీ పచ్చిపులుసు, ఎడిటింగ్:హృషికేశ్ పస్పాల్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.