గోపీచంద్‌కి హీరోయిన్ ఫిక్స్...

March 10, 2026


img

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా రీతూవర్మని ఖరారు చేశారు. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు సత్యవతి అని తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. ఇదొక పీరియాడికల్ మూవీ అని దర్శకుడు సంకల్ప్ రెడ్డి ముందే చెప్పారు. ఏడవ శతాబ్దంలో జరిగిన ఓ యధార్ధ ఘటన ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 

సిల్వర్ స్ర్కీన్ బ్యానర్‌పై  శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. 



Related Post

సినిమా స‌మీక్ష