మంత్రి ఉత్తమ్‌కి తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి

March 11, 2026
img

అమెరికా-ఇరాన్‌ యుద్ధ ప్రభావం మొట్ట మొదట దేశంలో గ్యాస్ సరఫరాపై పడింది. ఇటీవలే గ్యాస్ సిలిండర్ ధరలు పెంచేసి, వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల సరఫరా కొన్ని ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో దేశ వ్యాప్తంగా హోటల్స్, టిఫిన్స్ సెంటర్స్, స్వీట్ షాప్స్, బేకరీలకు వాణిజ్య గ్యాస్ సరఫరా నిలిచిపోతోంది.

ఈ కారణంగా ప్రధాన నగరాలు, పట్టణాలలో అవి మూతపడుతున్నాయి. లేదా గ్యాస్ వినియోగం తగ్గించుకునేందుకు గాను మెనూలో పలు వంటకాలు తగ్గించేస్తున్నాయి.

వాణిజ్య గ్యాస్ సిలెండర్లు కొరత నానాటికీ పెరుగుతుండటంతో క్రమంగా ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల హాస్టల్స్, వర్కింగ్ మెన్, విమెన్ హాస్టల్స్ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. గ్యాస్ కొరత ఇలాగే పెరిగితే ఒకటొకటిగా అవి కూడా మూతపడక తప్పదు. 

ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి ఓ లేఖ వ్రాసింది. వాణిజ్య గ్యాస్ సరఫరాపై విధించిన ఆంక్షలను సరళం చేసి వేలాదిమందికి ఉద్యోగాలు కల్పిస్తూ, లక్షలాది మందికి నాణ్యమైన ఆహరం అందిస్తున్న హోటల్ రంగానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. 

కానీ అమెరికా-ఇరాన్‌ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా నానాటికీ క్షీణిస్తున్నప్పుడు రాష్ట్రాలు... మంత్రులు కూడా ఏమీ చేయలేరు. ఒకవేళ చేసినా ఏదో ఒకసారికి తాత్కాలికంగా సాయపడగలరు గానీ వారి సమస్యలను పూర్తిగా పరిష్కరించలేరు కదా?


Related Post