రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ వారిద్దరి కెరీర్లో ఓ మెయిలు రాయిగా నిలిచిపోతుంది. మళ్ళీ వారిద్దరూ కలిసి సినిమా చేస్తారంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘బుచ్చిబాబుతో పెద్ది పూర్తి చేస్తున్నారు.
దీని కోసం సుకుమార్ టీమ్ రెండు కధలు సిద్ధం చేస్తున్నారంటూ అసిస్టెంట్ డైరెక్టర్ షా హుస్సేన్ చెప్పారు. దీంతో గందరగోళం ఏర్పడింది. దీనిపై మళ్ళీ ఆయనే స్పందిస్తూ, “ఈ రెండు భిన్నమైన కధలు కావు. ఒకే కథని రెండు రకాలుగా వ్రాస్తున్నాము. వాటిలో ఏది బాగుంటే దానితో సినిమా తీస్తాము. కథ కారణంగా సినిమా ఆలస్యం కావడం లేదు. మేము రెడీగానే ఉన్నాము. రామ్ చరణ్ ఫ్రీ అయితే మేమూ రెడీ,” అని చెప్పారు.
ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ ప్రీ-విజువలైజేషన్ పనులు కూడా జరుగుతున్నాయి. రామ్ చరణ్ పెద్ది పూర్తిచేసి బయటకు రాగానే ఇది మొదలుపెట్టబోతున్నారు. అల్లు అర్జున్‌తో సుకుమార్ పుష్ప-3 మొదలుపెట్టాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ కోలీవుడ్ దర్శకులు లోకేష్ కనగారాజ్, అట్లీతో రెండు భారీ బడ్జెట్ సినిమాలతో లాక్ అయిపోయారు. కనుక రామ్ చరణ్‌తో సినిమా చేసేందుకు సుకుమార్‌కి కావాల్సినంత సమయం ఉంది.