ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ హైకోర్టు మాజీ సిఎం కేజ్రీవాల్, మాజీ డెప్యూటీ సిఎం మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవితతో సహా మొత్తం 23 మందికి నిన్న నోటీసులు జారీ చేసింది.
వారం రోజుల క్రితమే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసును కొట్టేసింది. సీబీఐ ఛార్జ్ షీట్ లోపభూయిష్టం ఉంది.. నిందితులు నేరం చేసినట్లు బలమైన సాక్ష్యాధారాలు చూపలేకపోయిందని ఆక్షేపించింది.
దీంతో కవిత మీడియా ముందుకు వచ్చి “ఇదొక తప్పుడు కేసని నేను ఆణిముత్యంలా బయటపడతానని ముందే చెప్పను. అలాగే జరిగింది. న్యాయస్థానం కేసు కొట్టేసి మాకు క్లీన్ చిట్ ఇచ్చింది. న్యాయం ధర్మం నావైపు ఉంది కనుకనే తిరుమల స్వామివారు ఈ కేసు నుంచి నాకు విముక్తి కల్పించారు... అందుకే కుటుంబ సమేతంగా కాలినడకన వచ్చి మొక్కు తీర్చుకున్నాను,” అని భావోద్వేగంతో చెప్పారు.
ఆమె ఇలా చెప్పుకునే సమయానికే సీబీఐ మళ్ళీ ఢిల్లీ హైకోర్టులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుని సవాలు చేస్తూ పిటిషన్ వేసింది. కనుక ఈ కేసులో మళ్ళీ నోటీసులు వస్తాయని ఆమెతో సహా అందరికీ తెలుసు. కానీ క్లీన్ చిట్ లభించిందని చెప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ నోటీసులు అందుకున్నారు. కనుక ఏం చెప్తారో... తేలికగానే ఊహించుకోవచ్చు.