కోలీవుడ్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో చేసిన ‘ఇడ్లీ కొట్టు’కి తెలుగు రాష్ట్రాలలో అక్టోబర్ 1న ప్రారంభోత్సవం జరిగింది. కానీ ధనుష్ చేసిన ఆ ఇడ్లీలు తెలుగు ప్రజలకు పెద్దగా నచ్చలేదు. కనుక కలక్షన్స్ అంతంత మాత్రమే వచ్చాయి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈనెల 29న ఈ ఇడ్లీ కొట్టు తెరవబోతున్నారు. కనుక ఓటీటీ ప్రేక్షకులకైన ధనుష్ చేసిన ఇడ్లీలు నచ్చుతాయో లేదో చూడాలి.
ఇడ్లీ కొట్టులో ధనుష్ నిత్యా మీనన్ జంటగా నటించారు. ఈ సినిమాలో సత్యరాజ్, అరుణ్ విజయ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్; కెమెరా: కిరణ్ కౌశిక్; కోరియోగ్రఫీ: సతీష్; ఆర్ట్: జాకీ, స్టంట్స్: పీటర్ హెయిన్స్ చేశారు.
గ్రామంలో తండ్రి నడిపించే ఇడ్లీ కొట్టుకి చుట్టు పక్కల గ్రామాలలో మంచి పేరున్నప్పటికీ, అలాంటి వ్యాపారాలు వద్దనుకున్న మన హీరో పెద్ద బిజినెస్ మ్యాన్‌గా ఎదుగుతాడు. కానీ దానిలో తృప్తి లేదని గ్రహించి మళ్ళీ గ్రామంలో ఇడ్లీ కొట్టుకే తిరిగివస్తాడు.
కానీ శత్రువులు అతనిని విడిచిపెట్టరు. హీరోని దెబ్బ తీయడానికి గ్రామానికి వస్తారు. వారు ఎవరు, ఎందుకు, ఏం జరిగిందనేది మిగిలిన కధ. నెట్‌ఫ్లిక్స్‌లో చూసి తెలుసుకోవచ్చు.