రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పెద్ది సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో వారిరువురిపై శ్రీలంకలో ఓ మాస్ బీట్ సాంగ్ చిత్రీకరించబోతున్నారు. దీని కోసం రామ్ చరణ్ శ్రీలంక చేరుకున్నారు. అక్కడ విమానాశ్రయంలో దిగినప్పుడు తీసిన వీడియో క్లిప్ పెద్ది చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. శ్రీలంకలో అందమైన ప్రదేశాలలో ఈ పాట చిత్రీకరించబోతున్నట్లు తెలిపింది.
బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్దిలో రామ్ చరణ్ గ్రామీణ క్రికెట్ ఆటగాడిగా నటిస్తుంటే, ఆయనకు కోచ్ గౌరు నాయుడుగా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. పెద్ది సినిమా 2026, మార్చి 27న విడుదల కాబోతోంది.
Team #Peddi is off to Sri Lanka for the next schedule ❤🔥
— PEDDI (@PeddiMovieOffl) October 24, 2025
The shoot will take place in the beautiful locales of the island nation ❤️
Stay tuned for more updates.#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026.
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor… pic.twitter.com/7t9u6uG2Yc