బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రం ‘కిష్కిందకాండ’తో పరవాలేదనిపించుకొని వెంటనే కొత్త సినిమా మొదలుపెట్టేశారు. సాగర్ కె చక్ర దర్శకత్వంలో మొదలుపెట్టిన సినిమాకి ‘టైసన్ నాయుడు’ అనే పేరు ఖరారు చేసి నేడు ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సాగర్ కె చక్ర; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; కెమెరా: ముఖేష్ జ్ఞానేశ్; ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: అవినాష్ కొల్ల, కిరణ్ కుమార్; స్టంట్స్: విజయ్, వెంకట్, రియల్ సతీష్ చేస్తున్నారు. ఈ సినిమాలో నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు.
ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి టైసన్ నాయుడు సినిమా నిర్మిస్తున్నారు.