త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ పౌరాణిక నేపద్యంతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత సూపర్ హిట్ అయ్యింది. కనుక ఈ సినిమాకి వారు సిద్దమైనప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇదివరకు జూ.ఎన్టీఆర్ వార్-2 షూటింగ్ కోసం ముంబాయి వెళుతున్నప్పుడు అయన చేతిలో తమిళ రచయిత ఆనంద బాలసుబ్రహ్మణ్యం వ్రాసిన ‘మురుగ ది లార్డ్ ఆఫ్ వార్, ది లార్డ్ ఆఫ్ విస్డమ్,’ అనే పుస్తకం కనిపించింది. ఆ కధతోనే త్రివిక్రమ్ ఈ సినిమాని జూ.ఎన్టీఆర్‌తో తీయబోతున్నట్లు సమాచారం.
కానీ ఇది పూర్తిగా పౌరాణికమా లేదా పౌరాణిక నేపధ్యం ఉన్న హనుమాన్, కల్కి వంటి సోషియో ఫ్యాంటసీ సినిమానా?అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు త్రివిక్రమ్. ముందుగా తన రైటర్స్ టీమ్‌లో కొత్తగా కొందరిని తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ చేస్తున్నారు. అది పూర్తి కాగానే త్రివిక్రమ్‌తో ఈ సినిమా మొదలు పెడతారు. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.