బాహుబలి, ది ఎపిక్ ట్రైలర్‌ విడుదల

October 26, 2025


img

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, నాజర్, రమ్యకృష్ణ, అనుష్క, తమన్న, సత్యరాజ్, అడవి శేష్, కిచ్చ సుదీప వంటి హేమాహేమీలతో తీసిన బాహుబలి-2 విడుదలై అప్పుడే 8 ఏళ్ళు. కనుక ఆ సినిమా గురించి కొత్తగా చెప్పుకునేందుకు ఏమీ లేదు.

కానీ ఇన్నేళ్ళ తర్వాత రాజమౌళి మళ్ళీ ఆ రెండు భాగాలను ఒక్కటిగా కలిపి బాహుబలి, ది ఎపిక్ పేరుతో ఈ నెల 31న విడుదల చేస్తున్నారు. కనుక ఈ రోజు ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. 

కానీ ముందే చెప్పుకున్నట్లు ట్రైలర్‌లో కూడా కొత్తగా ఏమీ ఉండదు. అవే సన్నివేశాలున్నాయి.

ముందు చెప్పుకున్నట్లు ఈ సినిమాకి చేసినవారు కూడా మారరు. కనుక ఓ సారి గుర్తు చేసుకుంటే సరిపోతుంది: ఈ సినిమాకి కధ: విజయేంద్ర వర్మ; దర్శకత్వం, స్క్రీన్ ప్లే: రాజమౌళి; సంగీతం: కీరవాణి; కెమెరా: కేకే సెంథిల్ కుమార్‌; స్టంట్స్: పీటర్ హెయిన్స్; కొరియోగ్రఫీ: ప్రేమ్‌ రక్షిత్, శంకర్, దినేష్ కుమార్‌, జానీ; ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు.  

ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి ఈ సినిమా నిర్మించారు.   


Related Post

సినిమా స‌మీక్ష