విష్ణు విశాల్ హీరోగా నటించిన ‘ఆర్యన్’ నుంచి ‘పరిచయమే...’ అంటూ సాగే పాట నేడు విడుదలైంది. ఇదో పెర్ఫెక్ట్ క్రైమ్ స్టోరీ అని ట్రైలర్‌తోనే చెప్పడం బాగానే ఉంది. కానీ ఈ రొమాంటిక్ సాంగ్‌లో కూడా పోలీసులు, క్రైమ్ సీన్ చూపించడమే వెరైటీ. సామ్రాట్ వ్రాసిన ఈ పాటకి గిబ్రన్ సంగీతం అందించి అబ్బీ, భ్రిట్టలతో కలిసి పాడారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ప్రవీణ్ కె; స్క్రీన్ ప్లే: మను ఆనంద్; డైలాగ్స్: సామ్రాట్; సంగీతం: గిబ్రన్; కెమెరా: హరీష్ కన్నన్; స్టంట్స్: స్టంట్ శివ, పీసీ రాధాకృష్ణన్ స్టంట్స్ ప్రభు చేశారు.
‘ఆర్యన్’ సినిమా విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌పై విష్ణు విశాల్ స్వయంగా తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మించి నటించారు. ఈ సినిమా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.