జూ.ఎన్టీఆర్‌ కాదు... రామ్ చరణ్‌తోనట?

October 26, 2025


img

కోలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌ సూపర్ స్టార్ రజనీకాంత్‌కి జైలర్ వంటి సూపర్ హిట్ అందించి, ఇప్పుడు ఆయనతోనే జైలర్-2 తీస్తున్నారు. అది పూర్తయిన తర్వాత జూ.ఎన్టీఆర్‌తో నెల్సన్ సినిమా చేస్తారని ఆ మద్యన వార్తలు వచ్చాయి.

కానీ జూ.ఎన్టీఆర్‌తో కాదు రామ్ చరణ్‌తో అని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నెల్సన్-రామ్ చరణ్‌ సినిమాని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తీయబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.

ఈ వార్తలు నిజమే అయితే జూ.ఎన్టీఆర్‌ అభిమానులకు చాలా నిరాశ, రామ్ చరణ్‌ అభిమానులకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. కానీ ఈ వార్తలను లైకా ప్రొడక్షన్స్ ఇంతవరకు ఖండించలేదు, ధ్రువీకరించలేదు. కనుక అధికారిక ప్రకటన వెలువడితే గానీ స్పష్టత రాదు. 

జూ.ఎన్టీఆర్‌ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్ చేస్తున్నారు. తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో సినిమా మొదలు పెట్టబోతున్నారు. రామ్ చరణ్‌ కూడా ప్రస్తుతం పెద్దితో చాలా బిజీగానే ఉన్నారు. అది పూర్తి చేసిన తర్వాత మళ్ళీ సుకుమార్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టబోతున్నారు. కనుక వారిద్దరిలో ఎవరితో సినిమా చేయాలన్నా నెల్సన్ కనీసం మరో ఏడాది వేచి చూడాల్సిందే!


Related Post

సినిమా స‌మీక్ష