ఆంధ్రాని అల్లకల్లోల్లం చేసిన మొంథా తుఫాను మంగళవారం రాత్రి 12.30 గంటలకు కాకినాడకు దక్షిణంగా నరసాపురం వద్ద తీరం దాటింది. అక్కడి నుంచి తెలంగాణ జిల్లాల మీదుగా ఛత్తిస్‌ఘడ్ వైపు ప్రయాణిస్తోంది. కనుక మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మరో 24 గంటల పాటు బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలలో నేడు సుమారు 20 సెంటీ మీటర్లు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, గంటకు 50-60 కిమీ వేగంగా ఈదురు గాలులు కూడా వేస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కనుక తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తూ జిల్లా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మొంథా తుఫాను కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ నుంచి ఏపీకి రాకపోకలు సాగించే పలు రైళ్ళు, బస్సులు, విమానాలు రద్దు చేశారు. తుఫాను ఉదృతి తగ్గినా తర్వాత పరిస్థితి సమీక్షించి రైలు, రోడ్, విమాన సేవలను పునరుద్దరిస్తారు.