జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మూడు ప్రధాన పార్టీలు ఇప్పటికే చాలా ఉదృతంగా ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో మాజీ సిఎం, ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పేరు కూడా ఉంది. కనుక ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా?అనే విషయం త్వరలో తెలుస్తుంది.
కేసీఆర్ వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీ తరపున సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈ నెల 31 నుంచి నవంబర్ 9 వరకు సిఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో వేర్వేరు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.
అక్టోబర్ 31 రాత్రి 7-8 గంటలకు: వెంగళ్ రావు నగర్, సోమాజీగూడ,
నవంబర్ 1 రాత్రి 7-8 గంటలకు: బోరబండ, ఎర్రగడ్డ,
నవంబర్ 4 రాత్రి 7-8 గంటలకు: రహమత్ నగర్, షేక్ పేట్-1,
నవంబర్ 5 రాత్రి 7-8 గంటలకు: షేక్ పేట్-2, యూసఫ్ గూడా,
నవంబర్ 8 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు: ఆరు డివిజన్లలో బైక్ ర్యాలీ,
నవంబర్ 9 ఉదయం 10 గంటలకు: షేక్ పేట్ బైక్ ర్యాలీ.