జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలపై కవిత సంచలన వ్యాఖ్యలు

October 28, 2025


img

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నికలలో ఏ పార్టీ గెలిచినా ప్రజలకు ఏం ప్రయోజనం ఉండదన్నారు. అందుకే తాము ఈ ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నామన్నారు. కల్వకుంట్ల కవిత మాటలు వాస్తవమే అని చెప్పక తప్పదు. మూడు పార్టీలు ఈ సీటు దక్కించుకోవడం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. 

అందుకోసం నియోజకవర్గానికి, ప్రజలకు సంబంధం లేని విషయాలు ప్రస్తావిస్తూ, ప్రత్యర్ధులపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నాయి. కానీ తమ అభ్యర్ధిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఏవిదంగా అభివృద్ధి చేస్తాము? నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను ఏవిదంగా పరిష్కరిస్తాము? ప్రజలకు ఏవిదంగా మేలు చేస్తామో చెప్పడం లేదు. ఒకవేళ చెపుతున్నా అవి మొక్కుబడిగా చెపుతూ ప్రత్యర్ధులపై విమర్శలు, ఆరోపణలే ఎక్కువ చేస్తున్నాయి. 

గెలిచిన పార్టీ తమ ప్రత్యర్ధులపై రాజకీయంగా పైచేయి సాధించినట్లవుతుంది. ఓడిన పార్టీలు మళ్ళీ ఎప్పటిలాగే రాజకీయాలతో కాలక్షేపం చేస్తుంటాయి. కనుక కల్వకుంట్ల కవిత చెప్పినట్లు ఈ ఉప ఎన్నికలలో ఏ పార్టీ గెలిచినా, ఓడినా నియోజకవర్గంలో ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. కానీ ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు ఇటువంటి ఎన్నికలు తప్పవు. కనుక ప్రజలే తమకు ఏ పార్టీ వలన మేలు కలుగుతుందో నిర్ణయించుకొని ఓట్లు వేయక తప్పదు. 

Video Courtesy: Big TV Breaking News)

Related Post