మాస్ జాతర ట్రైలర్‌… అంతా రోటీన్

October 28, 2025


img

మాస్ మహరాజ్ రవితేజ, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల జంటగా చేసిన ‘మాస్ జాతర’ ట్రైలర్‌ సోమవారం విడుదలయ్యింది. పేరులోనే ఇదో పక్క కమర్షియల్ మాస్ మసాలా సినిమా అని చెప్పేశారు. కనుక ట్రైలర్‌ కూడా అలాగే ఉంది. ఇదివరకు పోలీస్ ఆఫీసర్‌ లేదా మరో పాత్రలో చేసిన సినిమానే ఈసారి రైల్వే పోలీస్ వేషంలో మాస్ జాతర చేసేందుకు వస్తున్నారు. అయితే రవితేజ పంచ్ డైలాగులు, శ్రీలీల డాన్స్, కామెడీ బాగున్నాయి. కనుక వాటితో అభిమానులు మాస్ జాతర చేసుకోవచ్చు.          

సినీ రచయిత భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్: ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.  

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి మాస్ జాతర నిర్మించారు. ఈ నెల 31న బాహుబలి ది ఎపిక్ రీ-రిలీజ్ అవుతున్నందున, అదే రోజు విడుదల కావలసిన మాస్ జాతర మర్నాటికి వాయిదా వేశారు. కానీ అభిమానులని నిరుత్సాహ పరచకుండా అక్టోబర్‌ 31 సాయంత్రం 6 గంటల నుంచి మాస్ జాతర ప్రీమియర్ షోలు వేస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష