సినీ రచయిత భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ మహరాజ్ రవితేజ, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల జంటగా చేసిన ‘మాస్ జాతర’ నవంబర్ 1కి వాయిదా పడినప్పటికీ అభిమానులని నిరుత్సాహ పరచకుండా అక్టోబర్ 31 సాయంత్రం 6 గంటల నుంచి మాస్ జాతర ప్రీమియర్ షోలు వేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడింది కనుక హైదరాబాద్‌లో జేఆర్‌సీ కన్వెన్షన్‌లో మంగళవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కోలీవుడ్ నటుడు సూర్య వస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్: ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి మాస్ జాతర నిర్మించారు.