దేవ్ పారు నుంచి నా ప్రేమంత లిరికల్

October 28, 2025


img

 దేవదాస్, పార్వతి ప్రేమ కధ ఎవర్ గ్రీన్ క్లాసిక్! ఇప్పుడు అఖిల్ రాజ్ దర్శకత్వంలో ‘దేవ్, పారు' అనే మరో ప్రేమ కధ వస్తోంది. ఈ సినిమా నుంచి ‘నా ప్రేమంత....’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఆర్ఆర్ ద్రువన్ వ్రాసిన ఈ పాటని ఓషో వెంకట్ స్వరపరిచి సంగీతం సమకూర్చగా కాళేశ్వరం ప్రాజెక్టు భైరవ హృదయాలను తాకేలా అద్భుతంగా పాడారు. 

ఈ సినిమాలో మిన్‌హజ్ రుమీ, యష్ణ ముథులూరి, తనూజ మధురాపంతుల, ధీరజ్ బండి సంజయ్‌, మానస చావా, వశిష్ట సక్సేనా, అశోక్ వర్ధన్, కృతి దామరాజు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: అఖిల్ రాజ్, సంగీతం: ఓషో వెంకట్, కెమెరా: అశ్విన్ అంబేడ్ , ఎడిటింగ్: ప్రతీక్ నూతి, ఆర్ట్: సాయి కాధిర చేశారు.     


Related Post

సినిమా స‌మీక్ష