మాస్ మహారాజ్ రవితేజ, కామెడీ కింగ్ నవీన్ పోలిశెట్టి ఇద్దరూ కలిసి సినిమా చేస్తే?తప్పకుండా అందరినీ అలరించగల సినిమా అవుతుంది. సినీ రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ ఓ కధ సిద్దం చేయాగా దానికి వారిద్దరూ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రసన్న కుమార్ స్వయంగా దర్శకత్వం చేస్తారా లేదా వేరే దర్శకుడుతో చేస్తారా?అనేది ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే వీరి సినిమాపై ప్రకటన వెలువడనుంది.
ప్రస్తుతం రవితేజ చేసిన మాస్ జాతర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అక్టోబర్ 31న ప్రీమియర్స్, నవంబర్ 1న మాస్ జాతర మొదలవబోతోంది. నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు,’ సినిమాతో వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతికి వస్తున్నారు. కనుక రవితేజ, నవీన్ పోలిశెట్టి మల్టీ స్టారర్ ఖాయమనే భావించవచ్చు.