ఇప్పుడు పెళ్ళికి ముందు ‘ప్రీ వెడ్డింగ్ షూట్’ సర్వసాధారణమైపోయాయి. ఈ పిచ్చి బాగా ముదిరిపోవడంతో ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి కొత్త వ్యాపారం పుట్టుకొచ్చింది. కనుక ఈ అంశంపై వ్యంగ్యంగా తీసిన సినిమాయే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తిరువీర్, టీనా శ్రవ్య, మాస్టర్ రాబిన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. ఈ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ పిచ్చి మారుమూల గ్రామాలకు కూడా ఎలా పాకిపోయిందో ట్రైలర్‌లో చాలా చక్కగా హాయిగా నవ్వుకునేలా చూపారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్, సంగీతం: సురేష్ బొబ్బిలి, కెమెరా: కే సోమశేఖర్, ఎడిటింగ్: నరేష్ అదుప చేశారు.
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోని నిర్మాతలు సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసని నవంబర్ 7న థియేటర్లలో మన అందరికీ చూపించబోతున్నారు.