హనుమాన్ సినిమాతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ప్రశంశలు అందుకున్న ప్రశాంత్ వర్మ, ఓ పక్క జైహనుమాన్ చేస్తూనే తన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ బ్యానర్‌పై ‘మహాకాళి’ అనే సినిమా మొదలు పెట్టారు. అయితే ఈ సినిమాని ఆయన దర్శకత్వంలో తీయడం లేదు. పూజ కొల్లూరు దర్శకత్వంలో భద్రకాళి తెరకెక్కిస్తున్నారు. రేపు (గురువారం) ఉదయం 10.౦౮ గంటలకు భద్రకాళి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయబోతున్నట్లు వర్మ తెలియజేస్తూ బంగారు గాజుల రక్తం ఓడుతున్న మహిళ చేతిని చూపారు.
ఈ సినిమాని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్, ఆర్‌కేడీ స్టూడియోస్ కలిసి ఆర్‌కే దుగ్గల్ సమర్పణలో రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్నారు.
#Mahakali 🔱@RKDStudios #RKDuggal @PujaKolluru #AkshayeKhanna#RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/CALH4jdCqV
— Prasanth Varma (@PrasanthVarma) October 29, 2025