అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాను 8 యుద్ధాలు ఆపిన శాంతి దూతనని, తనకు యుద్ధాలు ఆపడమంటే చాలా ఇష్టమని చెప్పుకుంటారు. కనుక ఈ భూ ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగితే అక్కడ ట్రంప్ వాలిపోయి ఆపేస్తుంటారు. ఆయన మనసును బాగా అర్ధం చేసుకొన్న నెటిజన్స్ సోషల్ మీడియాలో చక్కటి పోస్టర్స్, కార్టూన్స్ పోస్ట్ చేస్తున్నారు. వాటిలో ఇది అత్యద్భుతంగా ఉంది.
కురుక్షేత్ర మహా సంగ్రామాన్ని ఆపేందుకు శ్రీకృష్ణ రాయబారం ఫలించలేదు. కానీ ట్రంప్ రాయబారం చేసి ఉండి ఉంటే తప్పకుండా నిలిచిపోయేదేమో?కానీ ట్రంప్ కాస్త ఆలస్యంగా పుట్టడం వలన కురుక్షేత్ర మహా సంగ్రామాన్ని ఆపలేకపోయారు. కానీ అప్పుడే ఉండి ఉంటే చివరి ప్రయత్నంగా యుద్ధభూమిలో నేరుగా శ్రీకృష్ణుడుతోనే మాట్లాడి ఒప్పించేవారేమో?అనిపిస్తుంది. అదే ఈ కార్టూన్!
నాడు కురుక్షేత్ర మహా సంగ్రామం మొదలు వరల్డ్ వార్-2 వరకు అనేక యుద్ధాలు జరిగాయి. వాటిలో అనేక కోట్ల మంది చనిపోయారు. వారందరూ దురదృష్టవంతులే. ఎందుకంటే అప్పటికి ట్రంప్ ఇంకా పుట్టలేదు. కానీ ఇప్పుడు మన మద్యనే ఉన్నారు. యుద్ధాలకు ‘ట్రేడ్ బ్రేకులు’ వేసి మరీ ఆపేస్తున్నారు. కనుక ఈ యుగంలో పుట్టిన మనమందరం అదృష్టవంతులమే... కదా?