మంత్రిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్న అజహర్

October 29, 2025


img

మాజీ క్రికెటర్, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ మహ్మద్ అజారుద్దీన్ ఇప్పుడు రాజకీయాలలో కూడా మంత్రిగా సెకండ్ ఇన్నింగ్స్  ప్రారంభించబోతున్నారు.

ఈ నెల 31న ఉదయం 11 గంటలకు రాజ్ భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మహ్మద్ అజారుద్దీన్ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేయాలనుకున్నారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయించి ఇప్పుడు నేరుగా మంత్రి వర్గంలోకి తీసుకోబోతున్నారు.

బహుశః ఈ హామీ లభించినండునే మహ్మద్ అజారుద్దీన్ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల బారి నుంచి తప్పుకొని ఎమ్మెల్సీ పదవి తీసుకున్నారని స్పష్టమవుతోంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ శాఖని అప్పగిస్తారో ప్రకటించే అవకాశం ఉంది.

మహ్మద్ అజారుద్దీన్ గతంలో ఉత్తర ప్రదేశ్, మొరదాబాద్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్‌ తిరిగి వచ్చేసి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలు చేప్పట్టారు. ఇప్పుడు మంత్రి పదవి చేపట్టబోతున్నారు. 

మహ్మద్ అజారుద్దీన్ని మంత్రి వర్గంలోకి తీసుకున్నప్పుడు ఇతర మంత్రుల శాఖల మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని సమాచారం.


Related Post