మహేష్ బాబు మేనకోడలు జాన్వీ హీరోయిన్‌గా ఎంట్రీ

October 29, 2025


img

టాలీవుడ్‌లో మరో కొత్త హీరోయిన్‌ ప్రవేశించబోతోంది. ఆమె మరెవరో కాదు మహేష్ బాబు మేనకోడలు జాన్వీ స్వరూప్! సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు బాబు సోదరి మంజుల తన కుమార్తె జాన్వీ స్వరూప్‌ని వెండి తెరపై హీరోయిన్‌గా చూడాలని కోరుకుంటున్నారు. కనుక చాలా కాలంగా కూతురుకి నటన, డాన్స్, ఫిట్ నెస్ శిక్షణ ఇప్పిస్తూ సినీ పరిశ్రమలో ప్రవేశించడానికి సిద్దం చేస్తున్నారు.

కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతో ఆమె సినీ పరిశ్రమలో ప్రవేశించబోతోందని స్వయంగా తెలియజేశారు. సంప్రాదాయ చీరకట్టులో ఒంటి నిండా ఆభరణాలతో జాన్వీ స్వరూప్ చూడ ముచ్చటగా ఉంది. త్వరలోనే ఆమె చేయబోయే సినిమా పేరు, దాని దర్శకుడు, హీరో, నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.            


Related Post

సినిమా స‌మీక్ష