డైరెక్టర్ వేణు ఊడుగుల ‘నీది నాదీ ఒకే కథ’, ‘విరాట పర్వం’ సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి సొంత ప్రొడక్షన్ హౌస్‌లో మొదటి సినిమాగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ తీశారు.
సాయిలు కంపాటి దర్శకత్వంలో అఖిల్, తేజస్వి రావ్ జంటగా నటించారు. ఈ సందర్భంగా “అన్ని అడ్డంకులను ధిక్కరించే గొప్ప ప్రేమకథను సెలబ్రేట్ చేసుకోండి” అంటూ ఓ చక్కటి పోస్టర్ విడుదల చేశారు.
ఇది వరంగల్-ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజమైన ప్రేమ కధ. దానిని సినిమా హంగులు జోడించి ‘రాజు వెడ్స్ రాంబాయి’గా విడుదల చేస్తున్నామని దర్శకుడు సాయిలు కంపాటి చెప్పారు.
దోలముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్స్ టేల్స్ బ్యానర్లపై రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాలో ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ కూడా ప్రధాన భాగస్వామిగా ఉంది. నవంబర్ 21న ఈ సినిమా విడుదల కాబోతోంది.