కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ హీరోగా నటించిన ఆర్యన్ ఈ నెల 31న విడుదల కావలసి ఉంది. కానీ నవంబర్ 7కి వాయిదా పడింది. ఆరోజున రాజమౌళి బాహుబలి, ది ఎపిక్, రవితేజ మాస్ జాతర్ ప్రీమియర్ విడుదలవుతున్నాయి. నవంబర్ 1న మాస్ జాతర విడుదలవుతోంది. కనుక వాటితో పోటీ పడితే నష్టపోయే ప్రమాదం ఉంటుంది కనుక ఆర్యన్ తెలుగు వెర్షన్ నవంబర్ 7కి వాయిదా వేసుకున్నారు. కానీ తమిళ్ వెర్షన్ మాత్రం ముందు ప్రకటించిన ప్రకారం ఈ నెల 31న విడుదల చేస్తున్నారు.
ఓ పెర్ఫెక్ట్ క్రైమ్ స్టోరీ ఆర్యన్‌కి కధ, దర్శకత్వం: ప్రవీణ్ కె; స్క్రీన్ ప్లే: మను ఆనంద్; డైలాగ్స్: సామ్రాట్; సంగీతం: గిబ్రన్; కెమెరా: హరీష్ కన్నన్; స్టంట్స్: స్టంట్ శివ, పీసీ రాధాకృష్ణన్ స్టంట్స్ ప్రభు చేశారు.
‘ఆర్యన్’ సినిమా విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌పై విష్ణు విశాల్ స్వయంగా తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మించి నటించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ నవంబర్ 7న విడుదల కాబోతోంది.