భారత్‌ నన్ను సంతోషపెట్టాలి లేకుంటే మళ్ళీ వాతలే...

January 06, 2026
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కళ్ళు మళ్ళీ భారత్‌పై పడ్డాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించుకున్నప్పటికీ భారత్‌ తనని సంతోషపెట్టలేకపోతోందని ట్రంప్‌ అన్నారు. “వాళ్ళు నన్ను సంతోష పెట్టలేకపోతే మళ్ళీ సుంకాలు పెంచాల్సి వస్తుంది,” అని ట్రంప్‌ హెచ్చరించారు. ప్రధాని మోడీ మంచివారే కానీ తాను చెప్పినట్లు వినడం లేదని ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

భారత్‌పై ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకాలు పెంచారు. ఇప్పటికీ రష్యా చమురు కొనుగోలు మానుకోకపోతే సుంకాలు ఇంకా పెంచుతామని ట్రంప్‌ హెచ్చరించారు. 

రష్యా నుంచి చవుకగా చమురు లభిస్తోంది. కానీ ట్రంప్‌ ఒత్తిళ్ళకు తలొగ్గి భారత్‌ ఇప్పటికే గణనీయంగా చమురు కొనుగోళ్ళు తగ్గించుకుంది. పూర్తిగా మానుకోవాలని ట్రంప్‌ పట్టుబడుతున్నారు. భారత్‌ కొనుగోలు చేస్తున్న చమురు వలన లభిస్తున్న సొమ్ముని ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడానికి పుతిన్ వినియోగిస్తున్నారని ట్రంప్‌ వాదిస్తున్నారు. కనుక ఆపేయాల్సిందే అంటున్నారు. చైనా కూడా రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. చైనా జోలికి ట్రంప్‌ పోవడం లేదు.

Related Post