ఉన్నత పదవులకి భార్య అందమే అర్హత?

January 30, 2026
img

ఏ ఉద్యోగం, పదవికైనా చదువు, తెలివితేటలు, ఆ రంగంలో అనుభవం, సామర్ధ్యం పరిగణనలోకి తీసుకుంటారు. అమెరికాలో అత్యంత కీలకమైన ఇంటీరియర్ సెక్రెటరీ పదవికి డౌగ్ బర్గం ఎంపికకు ట్రంప్‌ దిగ్రాంతి కలిగించే విషయం చెప్పారు.

ఓసారి ఓ మహిళ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియో చూశాను. ఈమె ఎవరో గానీ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉందే అనుకున్నాను. ఆమె డౌగ్ బర్గం భార్య క్యాథరిన్ అని తెలుసుకున్నాను. డౌగ్ బర్గంకు ఈ పదవి ఇవ్వడానికి ఇదే ప్రధాన కారణం,” అని డోనాల్డ్ ట్రంప్‌ నిర్మొహమాటంగా చెప్పేశారు. 

ఈ విషయం ఆయన రహస్యంగా చెప్పలేదు. ఓ వైపు తన భార్య, మరోవైపు డౌగ్ బర్గం దంపతులు నిలబడి ఉండగా మీడియా సమావేశంలో చెప్పారు. ఇది తెంపరితనమే కదా? కానీ అదేమీ చిన్న చితకా పదవి కాదు. కనుక డౌగ్ బర్గం దంపతులు ముసిముసినవ్వులతో ఇబ్బందికరమైన ఆ పరిస్థితిని దిగమింగుకున్నారు.           

ట్రంప్ ఏమన్నారో ఆయన మాటల్లోనే... 

Related Post