దావోస్ సదస్సులో తెలంగాణకు భారీ పెట్టుబడులు

January 22, 2026
img

దావోస్‌లో సదస్సులో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి బృందం రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు సాధించింది. రష్మీ గ్రూప్ రూ.12,500 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. స్లోవేకియా దేశానికి చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ రూ.6,000 కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయబోతోంది.

లోరియల్ సంస్థ రూ. 3,500 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో గ్లోబల్ టెక్ హబ్ ఏర్పాటు చేయబోతోంది. అమెరికాకు చెందిన సర్గాడ్ రూ.1,000 కోట్ల పెట్టుబడితో రాబోయే 3-5 సం.లలో హైదరాబాద్‌లో విమానాల మరమత్తు యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. సదస్సు రెండో రోజున మొత్తం రూ.23,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఈ మేరకు ఈ సంస్థలన్నీ సిఎం రేవంత్ రెడ్డి బృందంతో ఒప్పందం చేసుకున్నాయి. 

తాము ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ ద్వారా సుమారు 12,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని రష్మీ గ్రూప్ ప్రమోటర్ సజ్జన్ కుమార్‌ పట్వారీ తెలిపారు. 

లోరియల్ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే గ్లోబల్ టెక్ హబ్ ద్వారా సుమారు 2,000 మంది ఉద్యోగాలు లభిస్తాయని ఆ సంస్థ సీఈవో నికోలస్ హియేరోనిమాస్ తెలిపారు.

ఇవి కాక ప్రఖ్యాత బీర్లు తయారు చేసే కంపెనీ ‘ఏబీ ఇన్‌బెవ్’ ఇప్పటికే తెలంగాణలో ఉన్న తమ ప్లాంట్ల విస్తరణ చేపట్టి మరింత మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని ఆ సంస్థ చీఫ్ లీగల్ అండ్ కార్పోరేట్ ఎఫైర్స్ ఆఫీసర్ జాన్ బ్లడ్ చెప్పారు.   

Related Post