తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ అవడంతో ఆయన స్థానంలో నియమితులైన శివ్ ప్రతాప్ శుక్లా నేడు తెలంగాణ గవర్నర్‌గా లోక్ భవన్ (రాజ్ భవన్)లో బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేష్ కుమార్ సింగ్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకర కార్యక్రమానికి ముందు వందేమాతరం, జనగణమన ఆలపించారు.
ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, సిఎస్ రామకృష్ణారావు, తెలంగాణ డిజీపీ శివధర్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.