సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా చేసిన ‘గోదారి గట్టుపైన’ టీజర్ ఇటీవల విడుదలైంది. సినిమా పేరులోనే ఇది గోదావరి జిల్లాలో సాగే ప్రేమ కథని చెప్పేశారు. గోదావరి జిల్లాలలోని జీవనశైలిని ఆవిష్కరించేందుకు దర్శకుడు సుభాష్ చంద్ర చక్కటి ప్రేమ కథని ఎంచుకున్నారు. టీజర్, రెండు పాటలతో అందరినీ మెప్పించారు. ఇప్పుడు ముచ్చటగా మూడో పాట ‘బంగారు బొమ్మ’తో మెప్పించబోతున్నారు. ఈ నెల 13న ఈ పాట విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమాలో జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైల, దేవీ ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వివా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: సుభాష్ చంద్రం సంగీతం: నాగ వంశీ, కెమెరా: సాయి సంతోష్, స్టంట్స్: కార్తిక్ డంగ్రి, ఎడిటింగ్: అనిల్ పాశాల చేశారు.
ఏసియన్ సినిమాస్ సమర్పణలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అభినవ్ రావు నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.