నిహాల్, ప్రియాదేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారీ ప్రధాన పాత్రలు చేస్తున్న సినిమా పేరు ‘సందిగ్ధం.’ కానీ ఈ సినిమా రిలీజ్, సక్సస్ విషయంలో ఎలాంటి సందిగ్ధం లేదంటున్నారు దర్శకుడు పార్ధ సారధి కొమ్మోజు. ప్రస్తుతం సెన్సార్ పనులు జరుగుతున్నాయని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకా చకా జరిగిపోతున్నాయన్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామన్నారు.
ఈ సినిమాలో జీవ కొచ్చెర్ల, నవీన్ రాజ్, చిట్టిబాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు, నాగి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం: గౌతం రావిరామ్, కెమెరా:నందన్ కృష్ణ, సాహిత్యంల్ చింతా శ్రీనివాస్, ఎడిటింగ్: విశ్వన్ రాజ్ డీఎస్ చేస్తున్నారు.
తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై సంధ్య తిరుమల ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.