భర్తతో విడాకులు తీసుకున్న హాన్సిక

March 11, 2026
img

నటి హన్సిక మోత్వానీ అనేక తెలుగు సినిమాలలో నటించారు కనుక తెలుగు ప్రజలకు సుపరిచితురాలు. ఆ తర్వాత మెల్లగా బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయారు. అప్పుడే వ్యాపారవేత్త సోహైల్ ఖతూరియాని 2022 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. కానీ వివాహం జరిగిన రెండేళ్ళకే మనస్పర్ధలు ఏర్పడటంతో 2024 నుండి వేర్వేరుగా ఉంటున్నారు. గడిచిన రెండేళ్ళలో వారి మద్య రాజీ ప్రయత్నాలు సాగినప్పటికీ ఫలించలేదు. 

కనుక నేడు (మార్చి 11, 2026)న ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వారు పరస్పర అంగీకారంతో విడిపోయారు. వారికి న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. ఆమె సినిమాలలో నటించడం ద్వారా చాలానే సంపాదించుకున్నారు. కనుక భర్త నుంచి ఆమె ఎటువంటి భరణం కోరలేదు. ఇప్పుడు మళ్ళీ సినిమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


Related Post