కింగ్ నాగార్జున చాలా వేషాలు వేస్తున్నారట!

March 12, 2026


img

‘కింగ్ 100’ వర్కింగ్ టైటిల్‌తో అక్కినేని నాగార్జున 100వ సినిమా చేస్తున్నారు. కోలీవుడ్‌ దర్శకుడు రా. కార్తీక్ దీనికి దర్శకుడు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఈ సినిమా గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెపుతూ, “నాగార్జున పేరు చెప్పగానే శివ, రక్షకుడు, సైమన్ వంటి పాత్రలు కళ్ళ ముందు మెదులుతాయి. వాటన్నిటినీ గుర్తుచేసేలా ఈ సినిమాలో ఆయన పాత్ర ఉంటుంది.

డబ్బు, లాటరీ కదాంశంగా ఈ సినిమా రూపొందిస్తున్నాము. ఈ సినిమాలో నాగార్జున మూడు గెటప్స్ లో కనిపించి అందరినీ అలరించబోతున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. త్వరలోనే మరిన్ని అప్‌డేట్‌ ఇస్తాను,” అని చెప్పారు. 

నాగార్జున గత ఏడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌తో కలిసి ‘కుబేర’తో హిట్ కొట్టారు. ఇప్పుడు అయన కెరీర్‌లో ఇది వందో సినిమా కనుక ఇది కూడా మైలురాయిగా నిలిచిపోయేలా ఉండాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా టబూ నటిస్తున్నట్లు సమాచారం.  


Related Post

సినిమా స‌మీక్ష