తెలంగాణ ఇన్‌ఛార్జ్ డిజీపీగా వ్యవహరిస్తున్న శివధర్ రెడ్డి ఏప్రిల్ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. కనుక ఆయన స్థానంలో కొత్త డిజీపీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నిబంధనల ప్రకారం ఈ పదవికి అనుభవం, అర్హత, సీనియారిటీ ఉన్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను యూపీఎస్సీకి పంపిస్తే దానికి ఆమోదం లభించింది.
తెలంగాణ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సీవీ ఆనంద్ (1991), కేంద్ర ఇంటలిజన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ వినాయక్ ఆప్టే(1994), తెలంగాణ జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్యా మిశ్రా (1994) ముగ్గురిలో సీవీ ఆనంద్ సీనియర్. కనుక ఆయనకే ఈ పదవి లభించే అవకాశం ఉంది. సిఎం రేవంత్ రెడ్డి కూడా ఆయనకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజులలో యూపీఎస్సీ నుంచి లిఖిత పూర్వకంగా అనుమతి లభించగానే తెలంగాణ ప్రభుత్వం డిజీపీ పేరు అధికారికంగా ప్రకటిస్తుంది.