మొనాలిసా భోస్లే కేరళలో హడావుడిగా పెళ్ళి?

March 12, 2026
img

గత ఏడాది ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ అందరి దృష్టిని ఆకర్షించిన మొనాలిసా భోస్లేకి సినీ పరిశ్రమలో అవకాశాలు వచ్చాయి. ఆమె తెలుగులో శ్రీను కోటపాటి  దర్శకత్వంలో సాయిచరణ్ హీరోగా తీస్తున్న ‘లైఫ్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సినీ పరిశ్రమలో ఇలాంటి అవకాశం కోసం ఎన్నో వేలమంది ఏళ్ళ తరబడి ఎదురు చూస్తుంటారు. మోనాలిసా భోస్లే కోరకుండానే ఇలాంటి అవకాశం లభించింది. దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిన తరుణంలో ఆమె పెళ్ళితో ఫుల్ స్టాప్ పెట్టుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

మహారాష్ట్రకు చెందిన తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ని ఆమె నిన్న కేరళలోని పూవార్ అరుమనూర్‌లోని నైనార్ ఆలయంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. 

ఈ మతాంతర ప్రేమ, పెళ్ళిని ఆమె తండ్రి విజయ్‌ సింగ్ భోస్లే, అటు ఫర్మాన్ తల్లితండ్రులు కూడా అంగీకరించకపోవడంతో కేరళ వెళ్లి హడావుడిగా పెళ్ళి చేసుకున్నట్లు తెలుస్తోంది. 


Related Post