అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడారు. ఇరువురు పలు అంశాలపై సుదీర్గంగా మాట్లాడుకున్న తర్వాత ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇకపై రష్యా నుంచి చమురు కొనుగోలు చేయనని ప్రధాని మోడీ హామీ ఇచ్చినందున 25 శాతం సుంకాలు కూడా పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. వెనిజులా నుంచి భారత్‌కు చమురు సరఫరా చేస్తామని చెప్పారు.
ఇక నుంచి అమెరికా నుంచి సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ, ఇంధన, బొగ్గు ఉత్పత్తులు దిగుమతి చేసుకునేందుకు ప్రధాని మోడీ అంగీకరించారని చెప్పారు. వాటిపై అసలు సుంకాలు లేకుండా అనుమతిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని చెప్పారు.
కనుక తాము కూడా భారత్‌పై విధించిన సుంకాలు 25 నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా నుంచి బాట్ దిగుమతుల విలువ సుమారు 500 బిలియన్ డాలర్లు ఉంటుందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
అమెరికా చేసిన తాజా ప్రకటనతో ఇంతకాలంగా డీలా పడిన భారత్ షేర్ మార్కెట్లు మళ్ళీ పుంజుకున్నాయి. కానీ నష్టాల ఊబిలో నుంచి బయటపడటానికి మరికొంత సమయం పట్టవచ్చు.