అవును మేము పెళ్ళి చేసుకొన్నాము

December 12, 2017
img

భారత్ క్రికెట్ సారధి విరాట్ కొహ్లీ, బాలీవు నటి అనుష్క శర్మల మద్య చిరకాలంగా సాగుతున్న ప్రేమకధకు పెళ్ళితో ముగింపు పలికారు. వారిరువురు ఇటలీలో టస్కనీ రిసార్ట్ లో సోమవారం ఉదయం హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొన్నారు. వారి వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సమీప బంధువులు మాత్రమే హాజరయ్యారు. కొహ్లీ-అనుష్కలు తమ పెళ్ళి గురించి ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. “ఇక జీవితాంతం ఈ ప్రేమబంధంలో నిలిచిపోవాలని మేము ఈరోజు ప్రమాణాలు చేసుకోన్నాము. మీ అందరితో ఈ శుభసమాచారం పంచుకొంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులతో ఈ అందమైన రోజు మాకు ఇంకా ప్రత్యేకంగా నిలుస్తుంది. మా జీవితంలో ఇటువంటి ముఖ్యమైన రోజున మీరందరూ మావెంట నిలిచినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము,” అని విరాట్ కొహ్లీ ట్విట్టర్ లో మెసేజ్ పెట్టారు. దాని క్రింద తమ వివాహ కార్యక్రమానికి సంబందించిన ఒక ఫోటో కూడా పెట్టాడు. 


Related Post