ఇవాంకా వచ్చింది ఆ విమానంలోనా!

November 28, 2017
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నగరంలో చేస్తున్న అసాధారణ భద్రతా ఏర్పాట్లను చూస్తున్నవారికి ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోకమానరు. ఆమె అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో వస్తారని భావించడం సహజం. కానీ ఆమె ఇతిహాద్ ఎయిర్ వేస్ విమానంలో సాధారణ ప్రయాణికులతో కలిసి వచ్చారు. దానిలో కార్పోరేట్ క్యాబిన్ లో ఆమె ఉన్నట్లు మిగిలిన ప్రయాణికులకు బహుశః తెలిసి ఉండకపోవచ్చు. ఆమె వ్యక్తిగత భద్రతాసిబ్బంది, సదస్సులో పాల్గొనే ప్రతినిధులు కలిసి మొత్తం మంది ఆమెతో కలిసి వచ్చారు. ఆమె శంషాబాద్ విమానాశ్రయం చేరుకొన్న తరువాత భారీభద్రత నడుమ మాదాపూర్ లోని ట్రైడెంట్ హోటల్ కు చేరుకొన్నారు.

ఇక మరో విశేషమేమిటంటే, ఆమె తిరుగు ప్రయాణంలో కూడా సాధారణ ప్రయాణికులతో ఎమిరేట్స్ ఎయిర్ వేస్ లో దుబాయ్ చేరుకోబోతున్నారు. ఆమె భద్రత కోసం అమెరికా నిఘా మరియు భద్రతాధికారులు రెండు మూడు వారాల క్రితమే హైదరాబాద్ చేరుకొని చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నప్పుడు, ఆమె గల్ఫ్ దేశాలకు చెందిన ఇతిహాద్, ఎమిరేట్స్ విమానాలలో ప్రయాణించడం చాలా ఆశ్చర్యకరమైన విషయమే. మళ్ళీ ఆమె క్షేమంగా అమెరికా చేరుకొనేవరకు భద్రతాధికారులు అందరికీ కంటి మీద కునుకు ఉండదని చెప్పవచ్చు.   

Related Post