విద్యార్ధుల కోసం చంద్రబాబు ‘మైప్రోగ్రెస్ కార్డ్’

October 20, 2017
img

రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో వివిధ రాష్ట్రాలలో యువతీయువకులు రకరకాలైన కాంపిటీటివ్ పరీక్షలు వ్రాస్తుంటారు. వాటి కోసం కోచింగ్ సెంటర్లకు వేలు, లక్షలు కుమ్మరిస్తుంటారు. అయినా చాలా సార్లు ఫలితం కనబడదు. ఇక ఉన్నత విద్యలభ్యసించాలనే తపన ఉన్నప్పటికీ    ఆర్ధిక సమస్యల కారణంగా కోట్లాదిమంది పేద విద్యార్ధులు వాటికి దూరంకావలసి వస్తోంది. 

ఈ సమస్యను గుర్తించిన హాల్ మార్క్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ జై తాళ్ళూరి www.myprogresscard.com అనే ఒక వెబ్ సైట్ ను ఏర్పాటు చేశారు. దానిలో CAT, GATE, IBPS PRO, IBPS RRB, IBPS CLERK, IB, AP EAMCET NEET, UGC NET, JEE MAIN తదితర కాంపిటీటివ్ పరీక్షలకు సంబందించిన పూర్తి వివరాలు, క్వశ్చన్ బ్యాంక్, ప్రాక్టీస్ పరీక్షలు వగైరాలన్నీ అందుబాటులో ఉంచారు. 

ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు www.myprogresscard.com ను ఇల్లీనయిస్ లో బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపి రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఉత్తర అమెరికాలో ఏపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, తానా అధ్యక్షులు వేమన సతీష్, తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు జై తాళ్ళూరి తదితరులు పాల్గొన్నారు. 


అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన www.myprogresscard.com లో పొందుపరచబడిన సమగ్ర సమాచారం, నిర్వహించబడే ప్రాక్టీస్ పరీక్షలు వగైరాలన్నీ ‘ఆల్ ఇండియా బేస్’ పరీక్షల ఆధారంగా రూపొందించబడినవి. దీనిలో ఏర్పాటు చేసిన స్టడీ మెటీరియల్, క్వశ్చన్ బ్యాంక్ ల ద్వారా విద్యార్ధులు తమ విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని మళ్ళీ దీనిలోనే ప్రాక్టీస్ పరీక్షలు వ్రాయవచ్చు. ఆయా సబ్జెక్ట్ లలో వారికున్న నైపుణ్యం, వారి లోపాలు మొదలైన అంశాలను ఈ వెబ్ సైట్ విశ్లేషించి మళ్ళీ వారికి తగిన తగిన సూచనలు, సలహాలు ఇస్తుంది. కనుక పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్న విద్యార్ధులు అందరికీ ఈ వెబ్ సైట్ చాలా ఉపయోగపడుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు కావలసినవారు www.myprogresscard.com ను సందర్శించవచ్చు. 







Related Post