అట్టహాసంగా ముగిసిన తానా రీజినల్ కాన్ఫరెన్స్

October 16, 2017
img

అమెరికాలో తానా ప్రాంతీయ సదస్సు అక్టోబర్ 14న లాన్స్ డేల్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, బిజినెస్ సెమినార్లు నిర్వహించబడ్డాయి. 

ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11వరకు ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ చిత్ర..ఆమె బృందంతో నిర్వహించిన ఆర్కెస్ట్రా అందరినీ అలరించింది. హేమచంద్ర, గీతామాధూరి, శ్రీకృష్ణ, సమీర భరద్వాజ్, పృథ్వి తదితరులు కూడా తమ పాటలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమాలకు అతిధులుగా ప్రముఖ సినీ నటులు కమలిని ముఖర్జీ, నందు హాజరయ్యారు.      

ఈ కార్యక్రమాలకు స్ప్రూస్ ఇన్ఫో టెక్, క్యూర్ లెర్నింగ్, ఆంధ్రా బ్యాంక్, పి.ఎం.జె., ఎస్.టి.ఎస్.స్యూర్ టెక్ సర్వీసస్, ఈ.ఏ.టీం, కోవెంట్ సొల్యూషన్స్, టి.ఐ.ఎస్., స్వరాజ్య, బిర్యానీస్, కోస్పిర, తదితర సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరించగా, ఎన్.టీవి, టీవి-5, మన టీవి, ఐ డ్రీం మీడియా.కాం మీడియా పార్ట్ నర్స్ గా వ్యవహరించాయి. 

Related Post