మన తెలుగుమ్మాయికి మద్దతు పలకండి

June 30, 2017
img

తెలంగాణాలో ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేటకు చెందిన కళ్యాణపు శ్రావ్య అనే మన తెలుగింటి అమ్మాయి వచ్చే ఏడాది జూలైలో జరుగబోయే మిస్ వరల్డ్ అందాల పోటీలో పాల్గొనబోతోంది. ఇటీవల జరిగిన ఉత్తర ఆల్బెర్టా వరల్డ్ టైటిల్ పోటీలలో శ్రావ్య టైటిల్ గెలుచుకొంది. జూలైలో జరుగబోయే మిస్ వరల్డ్ అందాల పోటీలో కూడా తప్పకుండా గెలుస్తానని నమ్మకం వ్యక్తం చేస్తోంది. కనుక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, అలాగే భారతీయులు అందరూ కూడా తనకు సోషల్ మీడియాలో మద్దతు తెలుపవలసిందిగా ఆమె అభ్యర్దిస్తోంది. 

ఆమె తండ్రి కళ్యాణపు రవికుమార్ అదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడలో 2002 నుంచి మూడు సంవత్సరాల పాటు ఏవోగా పనిచేశారు. ఆ సమయంలో శ్రావ్య అక్కడే 7వ తరగతి వరకు చదువుకొంది. ప్రస్తుతం ఆమె కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ ఆల్బెర్టాలో కెమికల్ ఇంజనీరింగ్ (3వ సం.) చదువుకొంటోంది. మన తెలుగింటి ఆడపడుచు మిస్ వరల్డ్ పోటీలకు వెళుతుంటే ఆమెకు మనమూ పలికడం భావ్యమే కదా! 

ఆమె ఫేస్ బుక్, ట్వీట్టర్ చిరునామాలు ఇవే: 

https://twitter.com/missnaworld2017?lang=en 

https://www.facebook.com/MissNorthernAlbertaWorld2017 

Related Post