అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విమర్శలకు భయపడే రకం కాదు. కనుక తనకు ఏమి చేయాలనిపిస్తే అది చేసేస్తుంటారు. అత్యంత ఉన్నత పదవిలో ఉన్న ఆయన ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ సాయంతో పోప్ వేషధారణలో తన చిత్రాన్ని రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకవేళ అవకాశం లభిస్తే తప్పక పోప్ అవ్వాలని కోరుకుంటున్నానని ట్రంప్ దాని కింద పేర్కొన్నారు.
ఇటీవలే పోప్ ఫ్రాన్సిస్ చనిపోవడంతో యావత్ ప్రపంచంలో క్రీస్టియన్స్ అందుకు బాధపడుతుండగా డోనాల్డ్ ట్రంప్ ఈవిదంగా పోప్ వేషధారణలో తన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై పలువు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డోనాల్డ్ ట్రంప్ ఏవిదంగా అమెరికా ప్రజలందరికీ అధ్యక్షుడుగా గౌరవం పొందుతున్నారో, అదేవిదంగా ప్రపంచంలో క్రీస్టియన్స్ అందరూ పోప్‌ని తమ మత గురువుగా చాలా గౌరవిస్తారు. అటువంటి మత గురువు స్థానాన్ని డోనాల్డ్ ట్రంప్ చాలా అవహేళన చేశారని పలువురు విమర్శిస్తున్నారు.
కానీ కొందరు డోనాల్డ్ ట్రంప్ వేషధారణని మెచ్చుకుంటున్నారు. ఆ వేషధారణతో పాటు ఆయన ఆలోచనలలో కూడా సత్పరివర్తన వస్తే చాలా సంతోషిస్తామని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.